నవంబర్ లో రైతుబంధు రెండో విడత : కేటీఆర్

KTR Sరైతుబంధు పథకం విజయవంతంగా కొనసాగుతుందన్నారు మంత్రి కేటీఆర్. నవంబర్ లో రెండో విడత చెక్కుల పంపిణీ ఉంటుందన్నారు. గురువారం (మే-17) సిరిసిల్ల జిల్లాలోని గూడెంలో రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు మంత్రి కేటీఆర్.  ఇది ఎన్నికల కోసం చేస్తుందని కాంగ్రెస్ అనడం సరికాదన్న కేటీఆర్..70 ఏళ్ల చరిత్రలో చేసిందేమిలేదన్నారు.

త్వరలోనే కంటివెలుగు కార్యక్రమం రానుందన్నారు కేటీఆర్. ఇంతటితో తెలంగాణ పథకాలు ఆగవన్న ఆయన.. జూన్ లో రైతులకు భీమా ఇవ్వటం జరుగుతుందని..ఆ తర్వాత మిషన్ భగీరత కార్యక్రమాలు ఉంటాయన్నారు.  రైతులకు స్వయానా ఒక్కపైసా తేడాలేకుండా డబ్బులు ఇచ్చే గొప్ప కార్యక్రమం రైతుబంధు అన్నారు. మధ్యలో దళారులు లేకుండా ప్రతి పైసా రైతుకే చెల్లేలా ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. రైతులకు చెక్కులే కాకుండా..రుణమాఫీ చేశామని..అలాగే గోదాములు ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానది అన్నారు. పంటకు పెట్టుబడి కింద రుణంలేకుండా ఫ్రీగా డబ్బులు ఇచ్చి, దేశ చరిత్రలో రికార్డును తిరగరాశామన్నారు. ఆంధ్రా రైతులకు కొంత మందికి చెక్కులు రావడంతో కేసీఆర్ పటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారని, దీంతో ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు మంత్రి కేటీఆర్.

 

 

Posted in Uncategorized

Latest Updates