నవంబర్ 24నే ఎన్నికలు…తప్పుడు ప్రచారమన్న సీఈవో

రాష్ర్టంలో  కొత్త ఓటర్ల నమోదుకు  ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే పది రోజుల ముందు వరకు కూడా  ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్  తెలిపారు. ఓటు హక్కు లేని వారు తమ ఓటును నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  కొత్త ఓటర్లు,అభ్యంతరాలు, సవరణల కోసం  23లక్షల 87 వేల 942 దరఖాస్తులు వచ్చాయన్నారు.  వీటి వెరిఫికేషన్ కోసం త్వరలోనే డోర్ టు డోర్ సర్వే చేయనున్నామన్నారు. 15,228 డ్లూపికేట్ కార్డులు గుర్తించామని తెలిపారు.

అభ్యంతరాలు, వినతులు,ఫిర్యాదల  స్వీకరణకు రేపే(సెప్టెంబర్.25) చివరి తేది అని రజత్ కుమార్ తెలిపారు. నవంబరు 24 నే ఎన్నికలంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పుబట్టారు. ఇలాంటి ప్రచారం కరెక్ట్ కాదని తెలిపారు. ఆస్తులు ప్రకటించని ఎమ్మెల్యేలపై చర్యలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘందే తుది నిర్ణయమని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates