నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కన్నుమూత

yaddanapudiప్రముఖ తెలుగు రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి చనిపోయారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు సాహిత్యంలో ఆమె రచనలు ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి. 1980, 90 ల్లో సులోచనారాణి ఎన్నో ప్రముఖుల నవలలు రాశారు. వీటి ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, చండీప్రియ, ప్రేమ లేఖలు, బంగారు కలలు, విచిత్ర బంధం, జైజవాన్, జీవనపోరాటం, మౌనపోరాటం, ఆత్మగౌరవం వంటి సినిమాలు ఆమె రచనల ఆధారంగానే వచ్చాయి. టీవీ సీరియల్స్ లోనూ తనదైన ముద్ర వేశారు. ఆమె రాసిన రాధ-మధు సీరియల్ ఎంతో పాపులర్ అయ్యింది.

1940 లో కృష్ణా జిల్లా మువ్వ మండలం కాజా గ్రామంలో జన్మించారు సులోచనారాణి. అమెరికాలో ఉంటున్న కూతురు శైలజ దగ్గరకు వెళ్లిన ఆమె అక్కడే చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో… తనకు ఎవరూ సాటిరారని నిరూపించుకున్నారు సులోచనారాణి.

Posted in Uncategorized

Latest Updates