నవాజ్ షరీఫ్ అరెస్ట్

తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ స్వదేశంలో అడుగుపెట్టిన పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్, ఆయన కూతురు మరియమ్‌ లను అరెస్టు చేశారు. పనామా పత్రాల కేసులో షరీఫ్‌కు పదేళ్లు, మరియమ్‌కు ఏడేళ్ల జైలుశిక్ష పడింది. శుక్రవారం రాత్రి లాహోర్‌ విమానాశ్ర యంలో దిగిన వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. భద్రతా అధికారులు విమానంలోకి ప్రవేశించి వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఎదురుచూస్తున్న షరీఫ్‌ తల్లిని కలుసుకునేందుకు వారికి అనుమతిచ్చారు. ఆ ఇద్దరినీ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇస్లామాబాద్‌కు తరలించారు. అనంతరం షరీఫ్‌ను రావల్పిండిలోని అదియాలా జైలుకు, మరియమ్‌ను తాత్కాలిక సబ్‌జైలుగా ఏర్పాటుచేసిన సీహాలా రెస్ట్‌ హౌజ్‌కు తరలించారు.

Posted in Uncategorized

Latest Updates