నవాజ్ షరీఫ్ కు షాక్ : జీవిత కాలం నిషేంధం

nawaz-sharifపాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ కు  పెద్ద షాకే ఇచ్చింది అక్కడి సుప్రీంకోర్టు. భవిష్యత్తులో ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించింది. పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62(1)(F) ప్రకారం షరీఫ్‌ ను జీవితకాలం నిషేధించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భాగంగా ఈ నిషేధం సరైనదేనని ఈ చారిత్రక తీర్పు సందర్భంగా ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. షరీఫ్‌ తో పాటు పాకిస్థానీ తెహ్రీకె ఇన్సాఫ్ ప్రధాన కార్యదర్శి జహంగీర్ తరీన్‌ పై కూడా జీవితకాల నిషేధం విధించారు.

చీఫ్ జస్టిస్ సాఖిబ్ నిసార్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ చారిత్రక తీర్పును వెలువరించింది. ఇది పాక్ రాజకీయ వ్యవస్థపై పెద్ద ఎత్తున ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. పనామా పేపర్స్ కేసులో గతేడాది జులై 28న రాజ్యాంగంలోని ఇదే ఆర్టికల్ కింద ఐదుగురు సభ్యుల ధర్మాసనం షరీఫ్‌పై నిషేధం విధించింది.

 

Posted in Uncategorized

Latest Updates