నవ్వుతూ దిగాడు.. అంతలోనే.. : స్కూల్ వ్యాన్ కింద పడి చిన్నారి మృతి

ACCస్కూల్ వదిలిపెట్టడంతో ఇంటికి వ్యాన్ లో వచ్చిన ఆ బాలుడు అదే వ్యాను కింద పడి చనిపోయాడు. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లాలోని రామయ్యగూడ ప్రాంతంలో జరింగింది. వికారాబాద్ కు చెందిన పాపయ్య, లక్ష్మీ దంపతులకు కుమారుడు సాయి విఘ్ణేష్. నాలుగేళ్ల విఘ్ణేష్ ని  వికారాబాద్ లోని నారాయణ స్కూల్లో చదువుతున్నాడు. రోజు వారీగానే గురువారం(జూన్-14) ఉదయం స్కూల్ కు వెళ్లాడు. స్కూల్ అయిపోవడంతో ఆనందంగా బ్యాగు సర్దుకుని స్కూల్ వ్యాన్ లో ఇంటికి బయలుదేరాడు. విఘ్ణేష్ దిగే స్టేజీ రావడంతో డ్రైవర్ వ్యాన్ ఆపడంతో ముందుగా బ్యాగ్ ని కిందపెట్టాడు క్లీనర్. ఆ తర్వాత దిగిన విఘ్ణేష్ బ్యాగ్ తీసుకుంటుండగా…గమనించని డ్రైవర్ వ్యాన్ ని ముందుకు పోనిచ్చాడు. ఆ సమయంలో విఘ్ణేష్ వ్యాన్ ముందు ఉండటంతో… ఆ విద్యార్థి పై నుంచి వెల్లింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ సాయి విఘ్ణేష్ ను వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లు కన్ఫాం చేశారు డాక్టర్లు. ఎంతో సంతోషంగా స్కూల్ కి వెళ్లి వచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Posted in Uncategorized

Latest Updates