నాకింకా వయస్సు రాలేదు : ఆ పెళ్లి నాది కాదన్న శ్రియ

SHRIYAహీరోయిన్ శ్రియ పెళ్లి చేసుకోబోతున్నట్లు రెండు రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అన్ని పేపర్లలోనూ ఈ వార్త వచ్చింది. పెళ్లి వార్తలపై శ్రియ స్వయంగా వివరణ ఇచ్చారు. అవన్నీ రూమర్స్ అంటూ కొట్టి పారేసింది ఈ హీరోయిన్. రాజస్థాన్ లో జరగనున్న తన స్నేహితురాలి వివాహం కోసమే దుస్తులు, నగలు ఆర్డర్‌ చేశానని తెలిపింది. ఇప్పట్లో తన పెళ్లి ఉండదని క్లారిటీ ఇచ్చింది. పెళ్లి వార్తలపై శ్రియ తల్లి నీర్జ కూడా స్పందించారు. రెండు వివాహ వేడుకల్లో పాల్గొనబోతోందని.. వాటి కోసం షాపింగ్ చేయటంతోనే ఈ రూమర్స్‌ పుట్టుకొచ్చాయని తెలిపారు. ఈ శుక్రవారం (ఫిబ్రవరి-6) రిలీజ్ అవుతున్న గాయత్రి సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్రియ.. ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నరగసూరన్‌ సినిమాతో పాటు మరో బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.

ఓ రష్యన్‌ యువకుడితో శ్రీయ సన్నిహితంగా ఉంటుందని.. అతడినే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. రాజస్థాన్‌లో వీరి వేడుక జరుగుతుందని కథనాలు కూడా వచ్చాయి. మొత్తానికి రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టిన శ్రీయ.. నాకింకా పెళ్లి వయస్సు రాలేదంటోంది.

Posted in Uncategorized

Latest Updates