నాకు ఎయిడ్స్ ఉంది.. నన్ను హగ్ చేసుకోండి

ఎయిడ్స్ ఉన్నవాళ్లను ముట్టుకున్నా.. షేక్‌హ్యాండ్ ఇచ్చినా.. కలిసి తిరిగినా ఎయిడ్స్ సోకదని చెప్పడం కోసం ఓ వినూత్న ప్రయత్నం చేసింది ఓ 16 ఏళ్ల అమ్మాయి. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన అజ్మా అనే అమ్మాయి రోడ్డు పక్కన నిల్చుని ఉంది. పక్కనే ఒక ప్ల కార్డు ఉంది . గత 10 సంవత్సరాల నుంచి నేను HIV పాజిటివ్ తో బాధపడుతున్నాను. నాకేం కాలేదు. నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఒక్కొక్కరు నన్ను కౌగిలించుకుంటుంటే.. నా ఫ్యామిలీ మెంబర్సే కౌగిలించుకున్నట్లుగా  అనిపిస్తుంది అని ఉంది. దీంతో ఆ చాలా మంది స్పందించారు. వచ్చి ఆ అమ్మాయిని కౌగిలించుకొని దైర్యం చెప్పి వెళ్లారు.

ఇప్పటికీ దీన్ని అంటువ్యాధిలా భావించి, కనీసం చూసినా కూడా ఆ వ్యాధి తమకు అంటుకుంటుందేమోనని భావించేవారు చాలామంది ఉన్నారు. ఈ అనుమానాలను దూరం చేసి, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు, ముఖ్యంగా ఈ వ్యాధితో బాధపడే చిన్నారులకు బాసటగా నిలవడం కోసం యునిసెఫ్‌ ఒక వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates