నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు : లాయర్ రామారావు

రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి ఇండ్లపై దాడులు జరుపుతున్నారనడం సరికాదన్నారు లాయర్ రామారావు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఇండ్లలో ఐటీ అధికారుల సోదాలపై ఆయన ఇవాళ (సెప్టెంబర్-28) మీడియాతో మాట్లాడారు. రేవంత్‌ రెడ్డిపై చేసిన ఫిర్యాదులో తాను చెప్పింది గోరంతా..  కానీ ఐటీ అధికారుల సోదాల్లో బయటపడుతుంది కొండంత అన్నారు.

19 డొల్ల కంపెనీలు, రూ. 400 కోట్ల అక్రమార్జనపై ఆధారాలతో ఫిర్యాదు చేశామన్నారు. సాయిమౌర్య కంపెనీ ద్వారా అక్రమాలు జరిగాయన్న ఆయన.. ఎన్నికల అఫిడవిట్‌ ను పరిశీలిస్తే.. ఈ అక్రమాలు బయటపడ్డాయని చెప్పారు.  రెండు నెలలు ఇన్వెస్టిగేషన్ చేశానన్న ఆయన.. నోటీసులకు సమాధానం చెప్పకుండా రాజకీయ కుట్ర అనడం సరికాదన్నారు. అక్రమార్జన చేసిన రేవంత్‌ కు మద్దతు తెలపడం సరికాదని తెలిపారు. ఢిల్లీ నుంచి స్పెషల్ టీమ్ రేవంత్‌రెడ్డి ఇండ్లలో సోదాలు చేసిందని.. రేవంత్ ట్యాక్స్‌ లను ఎగ్గొట్టేందుకు ప్రయత్నించారన్నారు. అధికారుల సోదాల్లో అనేక అక్రమాలు బయటపడుతున్నాయని.. హైదరాబాద్, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలు కూడా తానే బయటకు తీసినట్లు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates