నాకు కరోనా వస్తే మమతను హగ్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటా..

బీజేపీ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కామెంట్స్‌‌‌‌‌‌‌‌

కోల్‌‌‌‌‌‌‌‌కతా: బెంగాల్‌‌‌‌‌‌‌‌ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుపమ్‌‌‌‌‌‌‌‌ హజ్రా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనకు కరోనా సోకితే మమతా బెనర్జీని హగ్ చేసుకుంటానని చెప్పారు. అప్పుడే ఆమెకు ప్రజల కష్టం, బంధువులను కోల్పోయిన వారి బాధ తెలుస్తాయన్నారు. బెంగాల్‌‌‌‌‌‌‌‌ నుంచి బీజేపీ జాతీయ కార్యదర్శిగా కొత్తగా ఎన్నికైన అనుపమ్‌‌‌‌‌‌‌‌ హజ్రా సీఎం మమతా బెనర్జీపై ఈ కామెంట్స్‌‌‌‌‌‌‌‌ చేశారు. ‘కరోనా పేషెంట్లను దారుణంగా ట్రీట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. వైరస్‌‌‌‌‌‌‌‌ సోకి చనిపోయిన వారి డెడ్‌‌‌‌‌‌‌‌బాడీస్‌‌‌‌‌‌‌‌ను కిరోసిన్‌‌‌‌‌‌‌‌తో కాల్చేస్తున్నారు. మరణించిన వారి చివరి చూపులకు పిల్లలను కూడా అనుమతించడంలేదు. పిల్లులు, కుక్కలను కూడా మనం అలా ట్రీట్‌‌‌‌‌‌‌‌ చేయం’ అని చెప్పారు.

కామెంట్స్‌‌‌‌‌‌‌‌ను ఖండించిన టీఎంసీ..

మమతా బెనర్జీపై అనుపమ్‌‌‌‌‌‌‌‌ హజ్రా చేసిన కామెంట్స్‌‌‌‌‌‌‌‌ను టీఎంసీ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సౌగత్ రాయ్‌‌‌‌‌‌‌‌ తీవ్రంగా ఖండించారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళను అవమానించేలా కామెంట్స్‌‌‌‌‌‌‌‌ చేయడం బీజేపీ మైండ్‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌కు నిదర్శనమని చెప్పారు. సిలిగురి యూనిట్‌‌‌‌‌‌‌‌ బీజేపీ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా ర్యాలీ చేశారు.

 

Latest Updates