నాకు కూడా రాహులే బాస్ : చెప్పినట్లు వినాలంటున్న సోనియా

rahulకాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో సోనియా గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలసి ఎన్నికల్లో గెలుపు కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ నాకు కూడా బాస్ అని.. అందరూ రాహుల్ చెప్పినట్లు వినాల్సిందే అన్నారు. అతడు CPP చైర్ పర్సన్ కూడా.. అతనికి కాంగ్రెస్ లీడర్లు సపోర్ట్ చేయాలని కోరారు. చాలా కాలం తర్వాత మనం గ్రూప్ గా మీట్ అయ్యాం.. మీ సూచనలను కోరుతున్నాను అన్నారు. మనం రాహుల్ ని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని, అతడికి ఆల్ ది బెస్ట్ చెప్పారు సోనియా. నాతో ఎలాగైతే నిబద్ధత, ఉత్సాహం, విధేయతతో పని చేశారో.. అదే విధంగా రాహుల్ తో పని చేస్తారని ఆశిస్తున్నట్లు ఆకాక్షించారు.

రాహుల్ నాయకత్వంలో ప్రోగ్రెస్ స్టార్ట్ అయిందన్నారు. ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సోనియా. కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, చేసిన వాగ్ధాలను పూర్తి చేయటంలో విఫలం అయ్యారని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాక్సిమమ్ పబ్లిసిటీ.. మినిమమ్ గవర్నమెంట్ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలకే పేర్లు మార్చి అమలు చేస్తున్నారని చురకలు అంటించారు. బీజేపీ అసత్యాలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు సోనియా. రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించిందని.. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు.

Posted in Uncategorized

Latest Updates