నాకు కోపం వస్తే : బస్సు ప్రయాణికులను గజగజలాడించిన గజరాజు

CALIఓ డ్రైవర్ నిర్లక్ష్య వైఖరితో బస్సు ప్రయాణికులకు కొంతసేపు ప్రాణాలు పోయినంత పనైంది. పరుగెత్తుకుంటూ వచ్చిన ఏనుగును చూసి పదినిషాల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపారు. ఆదివారం(జూన్-24) ఉదయం కేరళ ఆర్టీసీ బస్సు కర్ణాటకలోని చామరాజనగర్ నుంచి కోజికోడ్ కు ప్రయాణికులతో వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

చాయరాజనగర్ నుంచి కోజికోడ్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బందీపూర్‌ ఫారెస్ట్ ఏరియాలోకి ప్రవేశించగానే ఓ ఏనుగుల గుంపు రోడ్డుపై నిలబడి ఉంది. అయితే అవి మనల్ని ఏం చేస్తాయిలే అన్న నిర్లక్ష్యపూరిత వైఖరితో సౌండ్ హారన్ మోగిస్తూ బస్సును ముందుకు పోనిచ్చాడు. సౌండ్ శబ్దానికి చిర్రెత్తిపోయిన గుంపులోని ఓ ఏనుగు బస్సు వైపు పరుగెత్తుకుంటూ వచ్చింది. దీంతో హడలెత్తిన ప్రయాణికులు డ్రైవర్ ను తిట్టడంతో బస్సును డ్రైవర్ వెనక్కి మళ్లించాడు. అయినా కూడా ఆ ఏనుగు బస్సును వెంబడించి మరీ బస్సును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో బస్సు స్వల్పంగా దెబ్బతింది. అయితే బస్సులోని ప్రయాణికులు బిగ్గరగా అరవడం మెదలుపెట్టారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిగ్గరగా ఏడ్వసాగారు. ప్రయాణికుల హాహాకారాలతో శాంతించిన ఆ ఏనుగు తిరిగి వెళ్లిపోయి తన గుంపులో కలిసింది.  అదే బస్సులో ప్రయాణికులందరూ సేఫ్ గా గమ్యస్ధానానికి చేరుకున్నారు. అయితే ఆ ఏరియాలో ఎనిమల్స్ ఫ్రీగా తిరిగేందుకు సాయంత్రం 6 నుంచి ఉదయం 7 వరకు వెహికల్స్ ను అనుమతించరని, నిబంధనలు ఉల్లంఘించి బస్సును ఆ రూట్లో తీసుకెళ్లిన డ్రైవర్ పై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates