నాకు రక్షణ కల్పించాలి : దీపికా రాజావత్

kathualawyerకథువాలో 8 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో బాలిక కుటుంబం తరఫున వాదిస్తున్న లాయర్ దీపికా రాజావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కూడా రేప్ చేసి, హత్య చేస్తారేమోననే అనుమానం వ్యక్తంచేశారు ఆమె. తనకు తగిన రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టును కోరుతానంది. నిన్ను ఎప్పటికీ క్షమించం అంటూ నాకు ఇప్పటికే బెదిరింపు కాల్స్ వచ్చాయంటున్నారామె. నేను ప్రమాదంలో ఉన్నట్లు సుప్రీంకోర్టుకు చెబుతానంది దీపికా. తమ కుటుంబానికి ముప్పు పొంచి ఉండటంతో కేసు విచారణను చండీగఢ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆ పాప తండ్రి ఇవాళ సుప్రీంకోర్టును కోరారు. కథువాలో విచారణకు అనుకూల వాతావరణం లేదు అని చెప్పారు దీపికా.

ఈ దారుణ ఘటనపై దేశమంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రేప్, హత్య కేసులో ఆరుగురు నిందితులు ఉన్నారు. ఆ పాపను కిడ్నాప్ చేసి ఓ గుడిలో బంధించి కొన్ని రోజుల పాటు అత్యాచారం చేసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నించిన ఇద్దరు పోలీసులపైనా కేసులు నమోదు చేశారు. ఈ కథువా గ్యాంగ్‌రేప్‌లో మాజీ రెవెన్యూ అధికారి సాంజీరామ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ రేప్ కేసుకు మతం రంగు పులుముతూ హిందూ ఏక్తా మంచ్ ఆధ్వర్యంలో నిందితులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఇందులో జమ్ముకశ్మీర్‌కు చెందిన ఇద్దరు బీజేపీ మంత్రులు పాల్గొనడం సంచలనం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడంతో ఆ ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు.

Posted in Uncategorized

Latest Updates