నాగం జనార్ధన్ రెడ్డి కొడుకు మృతి

కాంగ్రెస్‌  సీనియర్  నాయకుడు, మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి పెద్ద కొడుకు నాగం దినకర్‌రెడ్డి (48) గురువారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న దినకర్‌ రెడ్డి హైదరాబాద్‌ ఆపోలోలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దినకర్ రెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

గురువారం ఉదయమే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలిసి నాగం హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్‌ నేతలు గురువారం నాగర్‌కర్నూల్‌ లో నిర్వహించాల్సిన రోడ్‌ షోను రద్దు చేసుకున్నారు. నాగంకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా కాగా,పెద్ద కుమారుడు దినకర్‌రెడ్డి. దినకర్ రెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates