నాగం బలం టీడీపీతోనే పోయింది.. ఇక్కడ కాదు : డీకే అరుణ

DKMLC కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని కోరానని తెలిపారు గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ. దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు వస్తున్న ప్రచారం క్రమంలో గురువారం (జూన్-7) ఆయనతో భేటీ అయ్యారు డీకే అరుణ. సమావేశం అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ.. నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక సమయంలో తన బాధ ఎవరూ వినలేదని దామోదర్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారన్నారు.

ఆవేశం, ఆవేదన, బాధతో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీకి, వ‍్యక్తిగత నిర్ణయం అని చెప్పానన్నారు అరుణ. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని మరోసారి ఆయనను కోరినట్లు తెలిపారు డీకే అరుణ. ఇది ఒక రాజకీయ కుట్ర అని.. ఎవరు ఇబ్బంది పెట్టినా, తాన్ను టార్గెట్‌ చేసినా.. నేను సిన్సియర్‌ కార్యకర్తనని దామోదర్ చెప్పినట్లు తెలిపారు.

కాంగ్రెస్‌ గెలుపే తన లక్ష్యమని.. ఎవరు టార్గెట్‌ చేసినా భయపడి ఇంట్లో కూర్చోనన్నాడని తెలిపారు. తన వ్యక్తిగతం కోసం పని చేయడం లేదని.. మహబూబ్‌ నగర్‌ లో ఎప్పుడూ వర్గం లేదని అది ఇప్పుడే వినిపిస్తోందని దాయోదర్ చెప్పారన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని పని చేస్తున్నారన్నారు. నాగం టీడీపీలో బలమైన నాయకుడు కావొచ్చు.. కాంగ్రెస్‌ లో మాత్రం కాదని డీకే అరుణ అన్నారు. వాళ్లు బలమైన నాయకులు అయితే అక్కడే గెలవాలి కదా అంటూ కౌంటర్ వేశారు.

Posted in Uncategorized

Latest Updates