నాగం వస్తే ఆగం అవుతుంది : దామోదర్ రెడ్డి

DANAMనాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే గ్రూపు రాజకీయాలు పెరుగుతాయన్నారు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి. ఆయన్ను చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమన్నారు.

క్యాడర్ లేని లీడర్ నాగం ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి ఖాయమన్నారు. ఆయన ఎంపీగా, కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవన్నారు. తాను,  డీకే అరుణ, ఎంపీ నంది ఎల్లయ్య ఢిల్లీకి వెళ్లి నాగంను తీసుకుంటే వచ్చే పరిణామాలను రాహుల్ గాంధీకి వివరించామన్నారు. మీడియా చిట్ చాట్ లో ఈ విషయాలు చెప్పారు. నాగం, జైపాల్ రెడ్డి మధ్య అండర్ స్టాండింగ్ ఉందన్నారు దామోదర్ రెడ్డి. జైపాల్ రెడ్డి ఎంపీగా వెళ్లొద్దనుకోవడం వల్లే  నాగంను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నాగం కాంగ్రెస్ లో చేరితే సహకరించే ప్రసక్తే లేదన్నారు దామోదర్ రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates