నాగచైతన్య – సమంత కొత్త సినిమా ప్రారంభం

నాగ చైతన్య – సమంత జంటగా కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి – హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. జూలై 23వ తేదీ ఉదయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ప్రారంభం అయ్యింది. నాగార్జున చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. పెళ్లి తర్వాత సామ్, చైనా కలిసి నటిస్తున్న మూవీ ఇదే. దివ్యాన్ష కౌశిక్ రెండో హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస్ అవసరాల, రావురమేష్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ రెండో వారం నుంచి ప్రారంభం అవుతుంది. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. సాహు గారపాటి – హరీష్ పెద్ది నిర్మాతలు.

Posted in Uncategorized

Latest Updates