నాగర్‌కర్నూల్ లో 5 నెమళ్లు మృతి  

నాగర్‌కర్నూల్ జిల్లా గగ్గళ్లపల్లి గ్రామ సమీపంలోని పంటపొలాల్లో ఐదు నెమళ్లు మృతి చెందాయి. పంటపొలాల్లో మృతి చెందిన నెమళ్లను చూసిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పరీక్షల కోసం మృతి చెందిన నెమళ్లను నాగర్‌కర్నూల్ పశువైద్య ఆస్పత్రికి తరలించారు అటవీ అధికారులు. నెమళ్లు చనిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడానికి పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు.

Posted in Uncategorized

Latest Updates