నాగారంలో భారీ అగ్ని ప్రమాదం

ED-220518-MALKAJGIRIFIRE-AV-1మేడ్చల్ జిల్లా  నాగారం  SV నగర్ లో మంగళవారం (మే-22)  భారీ  అగ్నిప్రమాదం  జరిగింది. స్థానిక  బాంబే టింబర్  డిపోలోని  కూలర్  గోదాంలో  తెల్లవారుజామున  మంటలు అంటుకున్నాయి.  రెండు  ఫైరింజన్లతో  మంటలను అదుపులోకి  తెచ్చే  ప్రయత్నం చేస్తున్నారు.

సంఘటనకు  షాట్ సర్క్యూట్  కారణమని  అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాదంతో  30 లక్షల  ఆస్థి నష్టం  జరిగినట్లు  అధికారులు  అంచనా వేస్తున్నారు.  ప్రమాదాలకు కారణమయ్యే  గోదాములకు  జనావాసాల  మధ్య  పర్మిషన్  ఇవ్వటంపై  స్థానికులు  మండిపడుతున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా  శంషాబాద్ లోనూ  మంగళవారం  అగ్నిప్రమాదం  జరిగింది. శంషాబాద్  సమీపంలోని  గగన్ పహాడ్  దగ్గర  ఓ గోదాంలో   జరిగిన  ఫైర్ యాక్సిడెంట్ లో  భారీగా మంటలు  ఎగసిపడ్డాయి. గోదాంలో  ప్లాస్టిక్  ఫైబర్ వస్తువులు  ఎక్కువగా ఉండడంతో  పరిసర ప్రాంతాల్లో  దట్టమైన  పొగలు అలముకున్నాయి.  దీంతో స్థానికులు భయాందోళనకు  గురయ్యారు. సమాచారం  అందుకున్న  ఫైర్ సిబ్బంది  మూడు  ఫైర్ ఇంజన్లతో  మంటలను అదుపులోకి  తెచ్చారు.

Posted in Uncategorized

Latest Updates