నాగార్జునసాగర్ : జానారెడ్డి ఓటమి… నోముల నర్సింహయ్య గెలుపు

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి ఓటమిపాలయ్యారు. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన నోముల నర్సింహయ్య గెలుపొందారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మూడుసార్లు జానారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి.. సాగర్లో 2018లో ఈసారి ఓడిపోయారు. అంతకుముందు.. చలకుర్తి నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన జానారెడ్డి ఐదుసార్లు గెలుపొందారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేగా జానారెడ్డి రెండుసార్లు హ్యాట్రిక్ విజయాలు నమోదుచేశారు. ఈసారి ఎన్నికల్లో నోముల నర్సింహయ్య… జానారెడ్డిపై విజయం సాధించారు.

Posted in Uncategorized

Latest Updates