నాగార్జున‌కి కాస్ట్‌లీ మందు బాటిల్

NAGటాలీవుడ్ న‌వ మ‌న్మ‌ధుడు నాగార్జున త‌న త‌న‌యుల‌తో పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఇటు నిర్మాత‌గా, అటు హీరోగా రాణిస్తున్నారు. రీసెంట్‌గా వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఆఫీస‌ర్ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న నాగ్ .. ప్ర‌స్తుతం శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీ స్టార‌ర్ లో న‌టిస్తున్నారు. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీ బుధ‌వారం (ఏప్రిల్ 4 ) నుండి రెండో షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. ఈ షెడ్యూల్‌లో నాని, నాగ్‌లు టీంతో జాయిన్ అయ్యారు.

అయితే సినిమా నిర్మాత అశ్వినీద‌త్ చాలా రోజుల త‌ర్వాత నాగార్జునతో క‌లిసి సినిమా చేస్తున్న సంద‌ర్భంగా నాగార్జున‌కి కాస్ట్‌ లీ మందు బాటిల్ పంపుతూ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన నాగార్జున ఆ మందు బాటిల్‌ని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ.. వైజ‌యంతి ఫ్యామిలీకి కృత‌జ్ఞ‌త‌లు.. ఫ‌స్ట్ డే షూట్‌.. శనివారం రాత్రి కోసం ఎదురుచూస్తున్నాను. అఖిల్ బ‌ర్త్‌డే ( ఏప్రిల్ 8) వ‌ర‌కు దీనిని ఆస్వాదిస్తూనే ఉంటాన‌ని రిప్లై ఇచ్చారు నాగ్‌. ఎన్నో హిట్ సినిమాల‌ని నిర్మించి, తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించి వైజ‌యంతి బేన‌ర్ మహాన‌టి అనే క్రేజీ ప్రాజెక్ట్ కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మే 9న విడుద‌ల కానుంది. కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న ఈ మూవీని నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్నాడు.

Posted in Uncategorized

Latest Updates