నాగాలాండ్ గాంధీ…నట్వర్‌ థక్కర్‌ కన్నుమూత

పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘నాగాలాండ్ గాంధీ’గా పేరుపొందిన నట్వర్‌ థక్కర్‌(86) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సెప్టెంబరు 19న గౌహతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. హాస్పిటల్ లో ఉన్న ఆయన ఆదివారం చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య లెంటినా, ఓ కుమారుడు, ఇద్దరు కుతుర్లు ఉన్నారు.
ఆరోగ్యం మొదట్లో కొంచెం కుదటపడినా తరవాత హఠాత్తుగా బీపీ పడిపోయిందని, కిడ్నీలు దెబ్బతిన్నాయని ఆయన కుమారుడు తెలిపారు.
స్వస్థలం మహారాష్ట్ర అయినప్పటికీ 1955లో నాగాలాండ్‌ వెళ్లిన దగ్గరి నుంచి ఆయన ఆ ప్రాంతాన్నే తన స్వస్థలంగా భావించేవారు. చుచుయిమ్లాంగ్ లో ‘నాగాలాండ్ గాంధీ’ ఆశ్రమాన్ని స్థాపించారు. గాంధీ సిద్ధాంతాలు, శాంతిని ప్రచారం చేసిన ఆయన నాగాలాండ్ గాంధీగా పేరుపొందారు.

Posted in Uncategorized

Latest Updates