నాగ్ చేతులమీదుగా చి.ల.సౌ ట్రైలర్

అన్నపూర్ణ స్టూడియోస్, సిరునీ సినీ కార్పొరేషన్ బ్యానర్స్ పై అక్కినేని హీరో సుశాంత్ నటించిన సినిమా చి.ల.సౌ. రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ మూవీలో సుశాంత్ సరసన రుహాణీ శర్మ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను అక్కినేని నాగార్జున చేతులమీదుగా శనివారం (జూలై-28) రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని నాగ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ట్రైలర్ విషయానికొస్తే..సుశాంత్ పెళ్లి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. సుశాంత్, రుహానీలపై ట్రైలర్ మొదలవుతుంది. పెళ్లి చేసుకో.. పెళ్లి చేసుకో అని ఎన్ని సార్లు అడుక్కోవాలని సుశాంత్ తల్లి సీరియస్.. నచ్చజెప్పడం అన్నీ చాలా అందంగా తెరకెక్కించారు డైరెక్టర్ రాహుల్.

సుశాంత్, రుహానీల మధ్య సీన్స్ ఆకట్టుకునేలా రూపొందించారు. హైదరాబాద్‌ లో ఉండే హ్యాండ్‌ సమ్ అబ్బాయిల్ని ఏమంటారో తెలుసా టూరిస్ట్  అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్స్ యూత్‌ కి బాగా కనెక్ట్ అవుతాయి. మొత్తంగా ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్‌ టైనర్‌ గా అన్ని రకాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీని ఆగష్టు 3 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ఆఫీషియల్‌ గా ప్రకటించింది సినిమా యూనిట్.

Posted in Uncategorized

Latest Updates