నాగ్ పూర్ ఉమెన్స్ వన్డే : ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ పై భారత్ విక్టరీ

IND WINఉమెన్స్ వన్డే సిరీస్ లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్-6) నాగపూర్ లో ఇంగ్లాండ్ తో జరిగిన ఫస్ట్ వన్డే మ్యాచ్ లో వికెట్ తేడాతో విక్టరీ సాధించింది టీమిండియా. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాడ్ 49.3 ఓవర్లలో 207 పరుగులు చేసింది. టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన మిథాలీ సేన.. 49.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసి విజయం సాధించింది.

ఇంగ్లాడ్ ప్లేయర్లలో విల్సన్(45), బీమోంట్ (37), హజల్(33), దానియెల్లి(27) తప్పా మిగతా ప్లేయర్లు రాణించలేకపోయారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్(4), ఏక్తా(3), దీప్తిశర్మ(2), గోస్వామి(1) వికెట్లు దక్కాయి. మొదట కెప్టెన్ మిథాలీ రాజ్ డకౌట్ కావడంతో చిక్కుల్లో పడ్డ టీమిండియా..ఆచితూచి బ్యాటింగ్ చేసింది. స్మృతి మందానా మరోసారి తనదైన స్టైల్లో విరుచుకుపడింది. సూపర్ ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన 5ఫోర్లు, 4సిక్సర్లతో 86 పరుగులు చేసింది. మెరుపు ఇన్నింగ్స్‌తో టీమిండియాకు విజయాన్ని అందించింది.

చివరి వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగిన పోరులో భార‌త మ‌హిళ‌లే గెలిచారు. భారత్ బ్యాట్స్ మెన్లలో దేవిక (15), మిథాలీ(0), మందానా (86), కౌర్(21), దీప్తిశర్మ (24), ఏక్తా (12), పూనమ్ (7), శిఖా పాండే (4), గోస్వామి (2), సుష్మా వర్మ (3) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ తో రెండో వన్డే ఏప్రిల్ 9న నాగ్ పూర్ లో జరగనుంది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0 లీడ్ లో ఉంది.

 

Posted in Uncategorized

Latest Updates