నానక్ రాం గూడలో భారీ పేలుళ్లు.. నలుగురు మృతి

హైదరాబాద్ లోని నానక్ రాం గూడలో శుక్రవారం(జులై-13) రాత్రి భారీ పేలుడు జరిగింది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో నలుగురు మృతిచెందగా… మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి దగ్గరలో ఉన్న లారీ, పక్క భవనం పూర్తిగా దెబ్బతిన్నాయి. గాయపడిన ఇద్దరూ పక్క భవనంలో ఉన్నట్లు తెలిసింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని పేలుళ్లు జరిగే ప్రమాదం ఉందంటున్న పోలీసులు.. అటువైపుగా ఎవరినీ అనుమతించడం లేదు.

Posted in Uncategorized

Latest Updates