నాన్సెన్స్.. కోహ్లీ ఆటను తట్టుకోలేకపోతున్నాం

ENGLANDటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని కౌంటీల్లో ఆడనివ్వడంపై తీవ్రంగా మండిపడ్డాడు ఇంగ్లండ్ మాజీ పేస్ బౌలర్ బాబ్ విల్లిస్. ఇలాంటి విదేశీ ప్లేయర్స్ వల్ల స్థానిక ఆటగాళ్లు మరుగున పడిపోతున్నారని చెప్పాడు. కోహ్లి కౌంటీలు ఆడటమేంటి నాన్సెన్స్‌ అంటూ మండిపడ్డారు. ఇలా విదేశీ ఆటగాళ్లు కౌంటీలు ఆడితే స్థానిక ఆటగాళ్లు నష్టపోతారని.. ఇది ఇంగ్లండ్‌ క్రికెట్‌కు అంత మంచిది కాదన్నాడు. ఆగస్టులో భారత్‌ ఇంగ్లండ్‌లో పర్యటస్తుండటంతోనే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నాడని ఆయన చెప్పాడు.

కౌంటీల్లో ఆడి అనుభవం పొందిన కోహ్లిని ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌లో ఆపటం ఇంగ్లీష్‌ బౌలర్లుకు కష్టమని ఈ మాజీ క్రికెటర్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్తుత్తమ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన కోహ్లి.. రాబోయే ఇంగ్లండ్‌ సిరీస్‌లో రాణిస్తే జోరూట్‌, స్టీవ్‌ స్మిత్‌, కేన్స్‌ విలియమ్సన్‌లను మించిపోతాడని చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్‌ గడ్డపై జరిగిన గత ఐదు టెస్టుల్లో కోహ్లి కేవలం 134 పరుగులు చేసి పేలవమైన ఆట తీరుతో అభిమానులను నిరుత్సాహపరిచిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత పర్యటనలోనైనా రాణించాలని పట్టుదలతో ఉన్నాడు కోహ్లీ. ఇదివరకే భారత టెస్టు బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా, బౌలర్లు ఇషాంత్‌ శర్మ, వరున్‌ ఆరోణ్‌లకు కౌంటీలు ఆడేందుకు BCCI అనుమతిచ్చిన విషయం తెలిసిందే. IPL తర్వాత ఇంగ్లీష్‌ జట్టుతో ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందకు భారత జట్టు ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది.

Posted in Uncategorized

Latest Updates