నామినేషన్లు ఇవే : 65వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్

VENKYసినీ స్టార్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిల్మ ఫేర్ అవార్డ్స్ వేడకకు రంగం సిద్ధమైంది. తారలతో దూందాం డాన్స్ లతో సినీ ఇండస్ట్రీని అలరించే 65వ దక్షిణ భారత ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం జూన్-16న జరగనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని HICC లో గ్రాండ్ గా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే అవార్డులు ఎవరినీ వరిస్తాయా అనేదానిపై టాలీవుడ్ లో ఉత్కంఠ. ముందుగా అవార్డులకు సంబంధించిన వివిధ కేటగిరీల్లో నామినేషన్ల ఫైనల్ లిస్టును విడుదల చేశారు నిర్వాహకులు. నామినేషన్లలో ఫ్యాన్స్ ఎవరికి పట్ట కడతారో వారినే ఫైనల్ చేయనున్నట్లు చెప్పారు. దీని ప్రకారం తెలుగు సినిమాకు సంబంధించిన నామినేషన్లు ఇలా ఉన్నాయి.

ఉత్తమ చిత్రం:
అర్జున్ రెడ్డి
బాహుబలి 2
ఫిదా
గౌతమీపుత్ర శాతకర్ణి
ఘాజీ
శతమానం భవతి

ఉత్తమ నటుడు:
చిరంజీవి – ఖైదీ నెంబర్ 150
జూనియర్ ఎన్టీఆర్ – జై లవకుశ
నందమూరి బాలకృష్ణ – గౌతమీపుత్ర శాతకర్ణి
ప్రభాస్ – బాహుబలి 2
వెంకటేష్ – గురు
విజయ్ దేవరకొండ – అర్జున్ రెడ్డి

ఉత్తమ నటి:
అనుష్క – బాహుబలి2
నివేధా థామస్ – నిన్నుకొరి
రకుల్ ప్రీత్ సింగ్ – రారండోయ్ వేడుక చూద్దాం
రితికా సింగ్ – గురు
సాయి పల్లవి – ఫిదా

ఉత్తమ దర్శకుడు:
క్రిష్ – గౌతమీపుత్ర శాతకర్ణి
రాజమౌళి – బాహుబలి 2
సందీప్ వంగ – అర్జున్ రెడ్డి
సంకల్ప్ రెడ్డి – ఘాజీ
సతీష్ వేగేష్న – శతమానం భవతి
శేఖర్ కమ్ముల – ఫిదా

ఉత్తమ సహాయ నటుడు:
ఆది పినిశెట్టి – నిన్నుకోరి
ప్రకాష్ రాజ్ – శతమానం భవతి
రాణా – బాహుబలి2
ఎస్‌జే సూర్య – స్పైడర్
సత్యరాజ్ – బాహుబలి2

ఉత్తమ సహాయ నటి:
భూమిక – ఎంసీఏ
కాథరీన్ థ్రెసా – నేనే రాజు నేనే మంత్రి
జయసుధ – శతమానం భవతి
రమ్యకృష్ణ – బాహుమలి2
శరణ్య ప్రదీప్ – ఫిదా

ఉత్తమ గీత రచయిత:
చైతన్య పింగాలి: ఊసుపోదు (ఫిదా)
చంద్రబోస్ – నువ్వేలే నువ్వేలే (జయ జానకి నాయక)
చంద్రబోస్ – రావణ (జై లవకుశ)
ఎం ఎం కీరవాణి – దండాలయ్య (బాహుబలి2)
రామజోగయ్య శాస్త్రి – శతమానం భవతి (శతమానం భవతి)
శ్రేష్ఠ – మధురమే (అర్జున్ రెడ్డి)

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్):
అనురాగ్ కులకర్ణి – మెల్లగా తెల్లారిందోయ్
అర్మాన్ మాలిక్ – హలో
హేమచంద్ర – ఊసుపోదు
ఎల్‌వి రేవంత్ – తెలిసెనే నా నువ్వే
సిద్ శ్రీరామ్ – అడిగా అడిగా

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (ఫీమేల్):
గీతా మాధురి & మాన్షి – మహానుభావుడు
మధుప్రియ – వచ్చిండే
నేహా భాసిన్ – స్వింగ్ జరా
సమీరా భరద్వాజ్ – మదురమే
సోని, దీపు – హంసనావ

Posted in Uncategorized

Latest Updates