నాయకుడిని కాదు. మీలో ఒకడిని : కమల్

KAMALJమక్కల్ నీది మయ్యం… అంటూ మధురైలో లక్షలాదిగా తరలివచ్చిన ఫ్యాన్స్ మధ్య ఉధ్వేగంగా పార్టీ పేరును ప్రకటించారు కమల్ హాసన్. తమది నీతిగా ప్రజల కోసం పనిచేసే పార్టీ అని చెప్పారు. తాను స్పీచ్ లు ఇవ్వడం కంటే.. ప్రజల నుంచి సలహాలు స్వీకరించడంపైనే ప్రత్యక శ్రద్ధ పెడతానన్నారు కమల్ హాసన్.
తమిళనాడులో కొత్త పార్టీ ఆవిర్భవించింది. మక్కళ్ నీది మయ్యం.. పేరుతో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు సినీనటుడు కమల్ హాసన్. చేతులు కలిపి.. మధ్యలో స్టార్ తో ఉన్న పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

మిగతా రాజకీయ పార్టీలకు మక్కళ్ నీది మయ్యం దిక్సూచిగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో అవినీతిని చూసి చూసి ఉడికిపోయి ఉన్నానని.. ఎవరైనా తనను తాకాలనుకుంటే తాకి చూడొచ్చని సవాల్ విసిరారు కమల్. ఇది ఒక్కరోజు వేడుక కాదని జీవితాంతం పోరాడాల్సి ఉంటుందని పార్టీ శ్రేణులకు చెప్పారు.

ఈ బహిరంగసభకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, పార్టీ తమిళనాడు ఇంచార్జ్ సోమ్ నాథ్ భారతి హాజరయ్యారు. పార్టీ అవిర్భావ సభకు లక్షలాదిగా అభిమానులు తరలివచ్చారు. ఉదయం నుంచి తమిళనాడులో బిజీగా గడిపారు కమల్ హాసన్. ఉదయం రామేశ్వరం వెళ్లిన ఆయన.. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఇంటికి వెళ్లారు. అక్కడ కలాం కుటుంబ సభ్యులను కలిశారు. కలాం సోదరుడు లెబ్బాయ్ కు వాచ్ గిప్ట్ గా ఇచ్చారు. మామూలు ఇంట్లో ఉండడం కలాం కుటుంబ సభ్యుల గొప్పతనమన్నారు. తర్వాత రామనాథపురంలో కలాం స్మారకాన్ని సందర్శించారు. స్మారకం దగ్గర నివాళులర్పించారు. రామేశ్వరం నుంచి మదురై వెళ్లిన కమల్ హాసన్ మధ్యలో తన స్వాగ్రామం పరంకుడి దగ్గర కాసేపు ఆగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు ఆయనకు స్వాగతం పలికి విషెస్ చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates