నాయకుల్లో మోడీనే ఉత్తముడు: బాబా రాందేవ్

దేశ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు  యోగా గురు బాబా రాందేవ్‌. దేశంలో నీచ రాజ‌కీయాలు న‌డుస్తున్నాయ‌ని ఆరోపించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు అనుసరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని.. ఇది దేశానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న నాయకులందరిలోనూ ప్రధాని మోడీ ఉత్త‌ముడ‌ని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరే నాయకుడూ ఆయనకు పోటీ రారని అన్నారు. 2019 ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి మద్దతివ్వనని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. త‌న‌కు రాజకీయ హద్దులు ఉన్నాయని చెప్పారు. ఉత్తమమైన భారత్‌ని తయారు చేసే వాళ్లకే త‌న మద్దతు ఉంటుంద‌న్నారు.

 

Posted in Uncategorized

Latest Updates