నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం ఇవ్వడం కుదరదు: చంద్రబాబు

babuనాయి బ్రాహ్మణులకు కనీస వేతనం ఇవ్వడం కుదరన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సోమవారం (జూన్-18) వెలగపూడి సెక్రటేరియేట్ దగ్గర.. ఏపీలోని ఆలయాల్లో పనిచేసే నాయి బ్రహ్మణులు ఆందోళనకు దిగడంతో.. వారితో మాట్లాడారు చంద్రబాబు. ఆందోళనకారుల సమస్యలు విన్న ఏపీ సీఎం.. ఇకపై ఆలయాల్లో పనిచేసే వారికి ప్రతీ టిక్కెట్ కు 25 రూపాయలు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కానందున.. కనీసం వేతనం ఇచ్చే అవకాశం లేదన్నారు బాబు. సెక్రటేరియేట్ లో ఆందోళనలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం.

Posted in Uncategorized

Latest Updates