నారదుడి వేషంలో ఎంపీ శివప్రసాద్

siva prasadఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంటు ఆవరణలో బుధవారం తెలుగుదేశం ఎంపీలు ఆందోళన చేపట్టారు. గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు చేతబూని ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబునాయుడిపై నిన్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా మండిపడ్డారు ఎంపీలు. ఇదిలా ఉండగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ నారదుడి వేషం ధరించి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. పార్లమెంటు ఆవరణలో పలువురు ఎంపీల దృష్టిని ఆకర్షించారు శివప్రసాద్.

Posted in Uncategorized

Latest Updates