నాలుగు కార్లు నుజ్జునుజ్జు : సికింద్రాబాద్ లో అర్ధరాత్రి లారీ బీభత్సం

CARసికింద్రాబాద్ లో  శుక్రవారం (జూన్-1) అర్ధరాత్రి….లారీ బీభత్సం సృష్టించింది. ప్యాట్ని సెంటర్ లో అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టిన ట్రక్… ఎదురుగా వస్తున్న ఐదు వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో నాలుగు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటనలో కార్లో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే  సమీప ఆస్పత్రికి తరలించారు.  లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు…కేసు ఫైల్ చేశారు.  వాహనాలను తొలగించి,  ట్రాఫిక్ ను క్లీయర్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates