నాలుగేళ్లు ఊరించి..రూ.200 పెంచారు : గుత్తా

GUTTAకనీస మద్దతు ధరలపై నాలుగేళ్లుగా ఊరించిన ప్రధాని మోడీ.. రైతులకు శుభవార్త అని ప్రకటించి తీవ్ర నిరాశకు గురిచేశారన్నారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పంట అయిన వరికి క్వింటాల్‌ కు రూ. 200 రూపాయలు మాత్రమే పెంచడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన వాణిజ్య పంట పత్తిసహా.. పప్పు ధాన్యాలకు కనీస మద్దతు ధరలు కాస్త ఫర్వాలేదని అన్నారు. గురువారం (జూలై-5) హైదరాబాద్ బషీర్‌బాగ్‌ లో రైతు సమన్వయ సమితి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కనీసం వరి క్వింటాల్ ధర రెండు వేలు ఇస్తేనే గిట్టుబాటవుతుందని తెలిపారు. ఎంఎస్పీ పెంచుతున్నామంటున్న కేంద్రం.. మరోవైపు రసాయన ఎరువుల ధరలు పెంచుతూ రైతులపై భారం మోపుతోందని సీరియస్ అయ్యారు. రుణమాఫీ, ఎంఎస్పీపై కేంద్రం తన వైఖరి వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates