నాలుగో వన్డే: కరుణించిన వరుణుడు-సఫారీల విక్టరీ

SA-IND-4thజొహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన  నాలుగో వన్డేలోలో దక్షిణాఫ్రికా .. టీమిండియా ‘హ్యాట్రిక్‌’ విజయాలకు బ్రేకులేసింది. శనివారం(ఫిబ్రవరి-10) జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (105) సెంచరీ సాధించగా, కోహ్లి (75) పరుగులతో రాణించాడు.

సౌతాఫ్రికా బౌలర్లు రబడ, ఇన్‌గిడి చెరో 2 వికెట్లు తీశారు.

తర్వాత 290 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది దక్షిణాఫ్రికా. అయితే వర్షం కారణంగా లక్ష్యాన్ని 28 ఓవర్లలో 202 పరుగులుగా నిర్ణయించగా… ఆ జట్టు 25.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి గెలిచింది.

ఓపెనర్లు మార్క్‌రమ్‌ (22), ఆమ్లా(33), ఫస్ట్‌డౌన్‌ డుమిని(10) తక్కువ పరుగులకే ఔటయ్యారు. నాలుగో స్థానంలో వచ్చిన ఏబీ డివిల్లీర్స్‌.. అందరూ ఊహించినట్లే చెలరేగి ఆడే ప్రయత్నం చేశాడు. కానీ 26 పరుగులకే పెవిలియన్‌ బాటపట్టాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన మిల్లర్‌, క్లాసెన్‌లు విజృంభించారు. చాహల్‌ బౌలింగ్‌లో లైఫ్‌లు పొందిన మిల్లర్‌ (39) సఫారీకి గెలుపుబాట వేశాడు. జట్టుస్కోరు 174 ఉన్నప్పుడు మిల్లర్‌..5వ వికెట్‌గా ఔటయ్యాడు. క్లాసెన్‌ (43, నాటౌట్‌) నిలిచి జట్టును గెలిపించాడు. ఫెలుక్‌వాయో (23, నాటౌట్‌) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.

భారత బౌలర్లలో కుల్దీప్‌ 2 వికెట్లు పగడొట్టాడు. చాహల్‌, బూమ్రా, పాండ్యాలకు తలో వికెట్‌ దక్కింది.

దీంతో ఆరు వన్డేల సిరీస్ లో భారత్ 3-1 ఆధిక్యతతో నిలిచి సిరీస్ కైవసం చేసుకోవాలంటే మరో మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  సిరీస్‌లో ఐదో వన్డే మంగళవారం(ఫిబ్రవరి-13) పోర్ట్‌ ఎలిజబెత్‌లో జరుగనుంది.

 

 

Posted in Uncategorized

Latest Updates