నాలో అపరిచితుడూ ఉన్నాడు : చిన్నారి ఉత్తరానికి చలించిన ట్రంప్

trumpజాలి, దయ, కరుణ, మానవత్వం వంటి అంశాలు తనలో కూడా ఎక్కువేనని ట్రంప్ నిరూపించుకున్నారు. కఠినమైన పదాలతో ఎప్పూడూ ప్రత్యర్ధులపై విరుచకుపడే ట్రంప్ నే మనం ఇప్పటి వరకూ చూశాం. అందుకు భిన్నంగా తనకు కూడా అందరి లాగా ఎమోషన్స్ ఎక్కువేనని ట్రంప్.. ఓ చిన్నారికి రాసిన లేఖను చూస్తే అర్ధమౌతోంది.

తన స్కూల్ దగ్గర 2016 సెప్టెంబర్ లో 14 ఏళ్ల ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో తన స్నేహితుడు మరణించాడని ఎవా(7) అనే చిన్నారి చాలా భాధపడింది. ఆ ఘటన తర్వాత ఎవా మానసికంగా కుంగిపోయింది. డాక్టర్లు కూడా ఇంటి దగ్గరే ఆ చిన్నారికి చదువు చెప్పించమని సూచించారు. స్నేహితుడి మరణాన్ని భరించలేక 2017 ఆగస్టులో ట్రంప్ కు ఓ ఉత్తరం రాసింది. పిల్లల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఆ ఉత్తరంలో ట్రంప్ ను ప్రశ్నించింది.

‘డియర్‌ మిస్టర్‌ ప్రెసిడెంట్‌, నా పేరు ఎవా రోస్‌ ఓస్లేన్‌. నాకు ఏడేళ్లు. రెండో తరగతి చదువుతున్నాను. గత ఏడాది టౌన్‌విల్లే ఎలిమెంటరీ స్కూల్‌ దగ్గర జరిగిన కాల్పుల్లో నా స్నేహితుడు జాకోబ్‌ ప్రాణాలు కోల్పోయాడు. అది చూసి నేను చాలా భయపడ్డాను. జాకోబ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఏదో ఒక రోజు మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నాకు తుపాకులు అంటే అసహ్యం. అది నా జీవితాన్ని నాశనం చేసింది. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ని కోల్పోయాను. మీరు చిన్నారులకు రక్షణ కల్పిస్తారా? మమ్మల్ని ఎలా కాపాడుతారు? దయచేసి ఇలాంటిది ఎప్పటికీ జరగనివ్వకండి’ అంటూ ఆ ఉత్తరంలో చిన్నారి తెలిపింది. అయితే ఈ ఉత్తరం చూసి ట్రంప్ చలించిపోయారు.

‘డియర్‌ ఎవా, నీ స్నేహితుడు జాకోబ్‌ మరణం గురించి నేను, మిసెస్‌ ట్రంప్‌ చాలా బాధపడుతున్నాం. నీ గురించి, నీ కుటుంబం గురించి, జాకోబ్‌ కుటుంబం గురించి మేము ప్రార్థిస్తున్నాం. చిన్నారులు అన్ని విషయాలు నేర్చుకునేది, స్నేహితులతో కలిసి పెరిగేది స్కూల్ లోనే. ఇక్కడ భయం ఉండకూడదు. అమెరికాలో చిన్నారులు సురక్షితమైన వాతావరణంలో పెరిగేలా చేయడమే నా లక్ష్యం. అమెరికన్ల రక్షణ గురించి, దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి మరింత కృషి చేస్తాను. ఏదైమైనప్పటికీ నీ జీవితంలో ఎంతో మంది నిన్ను ప్రేమించేవారు ఉన్నారు. నీకు సపోర్ట్‌ చేసే వారు ఉన్నారు. నీ కలలు సాకారమైతే చూడాలనుకునే వారు ఉన్నారు.’ అని ట్రంప్‌ ఆ చిన్నారికి ఉత్తరం రాసి సంతకం చేసి పంపించారు. ట్రంప్‌ నుంచి వచ్చిన సమాధానం చూసి ఆనందపడిన ఆ చిన్నారి ఆ లేఖలో పిల్లల రక్షణ కోసం ఏయే చర్యలు  తీసుకుంటారో చెప్పలేదంటూ ట్రంప్‌కు మరో ఉత్తరం రాసింది. పిల్లల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో తనకు తోచిన విధంగా ఐడియాలను రాసి మరో ఉత్తరం ట్రంప్ కు పంపించింది.

Posted in Uncategorized

Latest Updates