నా తప్పుకి నా శిక్ష : క్రికెట్ కు వార్నర్ గుడ్ బై

warnerసౌతాఫ్రికాతో మార్చి 24న జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బాల్‌ టాంపరింగ్‌ కి పాల్పడి ఏడాదిపాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. తప్పు చేశాననే బాధ, దాన్ని ఎన్నటికీ దిద్దుకోలేననే మానసిక క్షోభ అన్నీ కలసి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ను శాశ్వతంగా క్రికెట్‌ నుంచి తప్పుకునేలా చేశాయి. తన తప్పుకు శిక్షగా జీవితంలో ఆస్ట్రేలియా తరఫున క్రికెట్‌ ఆడనని ఈ రోజు(మార్చి31) డేవిడ్ వార్నర్‌ ప్రకటించాడు. మీడియా సమావేశంలో తన తప్పును ఒప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా ప్రజలు, క్రికెట్‌ అభిమానులను నేను క్షమాపణ చెబుతున్నానన్నారు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశానన్నారు. బాల్‌ టాంపరింగ్‌ వ్యవహారం దేశ ప్రతిష్ఠను దిగజార్చిందని అందుకు నన్ను క్షమించండని వార్నర్ తెలిపాడు.  క్రికెట్‌ ద్వారా దేశానికి గొప్ప పేరు తేవాలని కోరుకున్నానని, అయితే  నేను తీసుకున్న నిర్ణయం పూర్తిగా ప్రతికూల ప్రభావాన్ని చూపిందని, ఇది నన్ను జీవితకాలం బాధిస్తూనే ఉంటుందని, నాపై మీరు చూపించిన అభిమానాన్ని, గౌరవాన్ని భవిష్యత్తులో తిరిగి పొందుతానన్న నమ్మకం ఉందని వార్నర్‌ తెలిపాడు. తన ప్రవర్తన సరిగా లేదని దీనిపై నిపుణుల సాయం తీసుకుంటానని వార్నర్ తెలిపాడు.

Posted in Uncategorized

Latest Updates