నా తెలంగాణ కోటి ఎకరాల మాగాని : కేటీఆర్

సంక్షేమం..అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందన్నారు మంత్రి కేటీఆర్. గురువారం (ఆగస్టు-2) కుమ్రం భీం ఆసిఫాబాద్ లో సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్దరణ కార్యక్రమంలో పాల్గొన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ వస్తే మీ బతుకంతా చీకటి అవుతుందని ఎగతాలి చేశారని, ఇప్పుడు నాలుగు సంవత్సరాల్లోనే తిరుగులేని తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు.

కార్మికుల కోసం కృషి చేసే నాయకుడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పించన్లను పెంచామన్నారు. పేదవాడి ముఖంలో చిరునవ్వును కోరుకుంటారన్నారు. ఎవ్వరూ ప్రవేశపెట్టలేని పథకాలను ప్రవేశపెట్టినందుకు మెచ్చుకోవాల్సిందిపోయి..కేసీఆర్ ను గద్దె దించేయాలని కాంగ్రెస్ అనడం ఓర్వలేనితనం అన్నారు. నా తెలంగాణ కోటిరతనాల వీణాను..నా తెలంగాణ కోటీ ఎకరాల మాగానిగా తీర్చుదిద్దుతామన్నారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అన్నారు. ప్రజలకు మేము జవాబీదారులము తప్పా..ప్రతిపక్షాలకు కాదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణను సాధించుకుందామని తెలిపారు మంత్రి కేటీఆర్. ప్రతిపక్షాల తిట్లే తమకు దీవెనలు అని తెలిపిన కేటీఆర్..వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లతో  ప్రతి పక్షాలకు సమాధానం చెబుతారన్నారు.

Posted in Uncategorized

Latest Updates