నా నువ్వే మూవీ : జ్యోతిష్యానికే జ్వరం వస్తుంది

NANUVVEజయేంద్ర డైరెక్షన్ లో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న మూవీ నా నువ్వే. కల్యాణ్ రామ్ సరసన తమన్నా హీరోయిన్. మూవీ ట్రైలర్ బుధవారం (మే-16) రిలీజ్ అయ్యింది. నిమిషం 40 సెకన్లున్న ఈ ట్రైలర్ లో తమన్నా.. కల్యాణ్‌ రామ్‌ ప్రేమ కోసం తపించడాన్ని అందంగా చూపించారు. కల్యాణ్‌ రామ్‌ వేరే ప్రదేశానికి వెళుతుంటే.. వెళ్లండి కలుద్దాం అని తమన్నా అంటుంది. ఇందుకు పక్కనే ఉన్న వెన్నెల కిశోర్‌.. ఇదేం ట్విస్ట్‌ బావా.. జ్యోతిష్యానికే జ్వరం వచ్చేలా ఉంది అనే డైలాగ్ తో అదరగొట్టాడు. కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌ బ్యానర్ చిత్రీకరణ జరుగుతుంది. కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌ వట్టికూటి నిర్మాతలు. మే లాస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది యూనిట్. డైరెక్టర్ జయేంద్ర, కల్యాణ్ రామ్, తమన్నా కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో ఫ్యాన్స్ లో నా నువ్వేపై ఎక్స్ పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి.


Posted in Uncategorized

Latest Updates