నా పాస్‌పోర్ట్‌ పోయింది… సుష్మా జీ సాయం చేయండి: కశ్యప్

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పారుపల్లి కశ్యప్‌ ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో ఉన్నాడు. అయితే కశ్యప్‌ తన పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకున్నాడు. గత రాత్రి ఆమెస్టర్‌డామ్‌లో నా పాస్‌పోర్ట్‌ను పోగుట్టుకున్నాను … ఇప్పుడు డెన్మార్క్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ జర్మనీ ఓపెన్‌, సార్లౌక్స్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉందన్నాడు. డెన్మార్క్‌కు వెళ్లడానికి ఆదివారం (అక్టోబర్-14)కు టికెట్‌ తీసుకున్నానని తెలిపాడు. అయితే అదే సమయంలో నా పాస్‌పోర్ట్‌ పోయిందని… విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పునరుద్దరించేందుకు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాడు.

 

Posted in Uncategorized

Latest Updates