నా మిషన్ అదే : సీఎం కేసీఆర్

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు లో భాగంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. సోమవారం సాయంత్రం కోల్‌కతాకు చేరుకున్న ఆయన.. సచివాలయంలో మమతా బెనర్జీతో చర్చించారు. మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటే తన మిషన్ అని అన్నారు. తామంతా కలిసి  కాంక్రీట్ ప్లాన్ తో ప్రజల ముందుకు వస్తామని.. త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని కేసీఆర్ తెలిపారు.

మమతా బెనర్జీతో భేటీ అయిన తర్వాత కోల్‌కతా కాళీమాత ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ వెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బెంగాల్ పర్యటణ తర్వాత ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్.. రెండు, మూడు రోజుల పాటు హస్తినలో  ఉండే చాన్సుంది. ఢిల్లీలో ప్రధాని మోడీని మర్యాద పూర్వకంగా కలవనున్నారు. దీంతో పాటే.. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఢిల్లీలో UP  మాజీ CM లు మాయావతి, అఖిలేశ్ యాదవ్ తో సమావేశమవుతారని సమాచారం.

Posted in Uncategorized

Latest Updates