నా విజయ రహస్యం అనుష్క : నిను విడిచి ఉండలేనంటున్న కోహ్లీ

636547363469336375BCCI బిజీ షెడ్యూల్ తో కుటుంబానికి దూరమయ్యాడు ఇండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇటీవలే అనుఫ్క శర్మను పెళ్లి చేసుకొన్న విరాట్, పెళ్లి తరువాత అనుష్కకు దూరమయ్యానని తెగ భాధపడుతున్నట్లున్నాడు. వివాహం జ‌రిగిన కొన్ని రోజుల‌కే ద‌క్షిణాఫ్రికా టూర్ కి వెళ్లిన కోహ్లీ ఈరోజు తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. మై వన్ అండ్ ఓన్లీ అంటూ లవ్ ఎమోజీ తో ఉన్న ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే పెళ్లికి ముందు విరాట్ సరిగ్గా ఆడకపోవడానికి కారణం అనుష్కే అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో అనుష్కపై దాడి చేయగా, తన సపోర్ట్ తోనే తాను ఇన్ని విజయాలు సాధించగల్గుతున్నానంటూ సున్నితంగా తన అభిమానులను మందలించాడు కోహ్లీ. సౌతాఫ్రికా టూర్లో వన్డేల్లో అధ్భుత విజయానికి కూడా నా భార్యే కారణమంటూ తన అభిమానులను ఉద్దేశించి గాఢమైన ప్రేమలో మునిగి తేలుతున్న ఫోటోను విరాట్ పోస్ట్ చేయడంతో విరాట్ కు మహిళలపై ఎంత గౌరవమో అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. మరికొందరైతే విరాట్ కు తన పార్టనర్ తో గడిపేందుకు BCCI కొన్ని రోజులు అతడికి సెలవలు ఇవ్వాలని కోరుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates