నింగిలోకి రాకెట్ : PSLV-C41 సక్సెస్

pslv-c41భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) PSLV  సిరీస్‌ లో 43వ ప్రయోగం విజయవంతమైంది. గురువారం (ఏప్రిల్-12) ఉదయం 4.04గంటలకు PSLV-C41 రాకెట్ ద్వారా IRNSS -1I ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌ లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి కక్ష్యలోకి దూసుకెళ్లింది. 36 గంటల కౌంట్‌ డౌన్ పూర్తి చేసుకున్న అనంతరం ఉదయం 4.04 గంటలకు మొదటి లాంచ్‌ ప్యాడ్ నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్నది.

దేశానికి సొంత మార్గనిర్దేశక (నావిగేషన్) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో చేపట్టిన నావిక్ (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌ స్టెల్లేషన్) ప్రాజెక్టులో భాగంగా IRNSS -1I ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు. ఈ ప్రాజెక్టులో ఇది ఎనిమిదో ఉపగ్రహం. ఇదే చివరి ఉపగ్రహం కూడా. ఇప్పటికే ఏడు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇవన్నీ భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో తిరుగనున్నాయి. IRNSS-1I బరువు 1 వెయ్యి 425 కిలోలు. రాకెట్ ఎత్తు 44.4 మీటర్లు కాగా, శాటిలైట్, పేలోడ్‌ తోసహా మొత్తం బరువు 321 టన్నులు. ప్రయోగ సమయం 19 నిమిషాల 19.6 సెకండ్లు. మొత్తం నాలుగు దశల్లో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

భారత్‌కు సొంతగా మార్గనిర్దేశక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మన దేశ అవసరాల కోసం అమెరికాకు చెందిన గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం(GPS)పై ఆధారపడుతున్నాం. ప్రజా అవసరాలతోపాటు మిలిటరీకి వ్యూహాత్మకంగా ఉపయోగపడేలా నావిక్‌ ను రూపొందించింది ఇస్రో. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2వేల 246 కోట్లు. త్వరలో ఈ ప్రాజెక్టులోని ఉపగ్రహాల సంఖ్యను 8 నుంచి 11కు పెంచనున్నారు. భవిష్యత్‌ లో నావిక్ సేవలను విమానయాన రంగానికి సైతం విస్తరించాలని నిర్ణయించింది. ఇస్రో గత నెలలో నిర్వహించిన జీఎస్‌ఏటీ-6ఏ ఉపగ్రహ ప్రయోగం మొదట్లో విజయవంతమైనా, ఆ తర్వాత ఉపగ్రహంతో సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇస్రో లేటెస్ట్ ప్రయోగంతో విజయవంతం కావడంతో సంబరాలు జరుపుకున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.

Posted in Uncategorized

Latest Updates