నిజామాబాద్ కు రికార్డు మెజార్టీ రావాలి : కవిత

నిజామాబాద్ : TRS తోనే నిజామాబాద్ అభివృద్ధి సాధ్యం అయ్యిందన్నారు ఎంపీ కవిత. ఇవాళ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన ఆమె..2వేల 4 వందల కోట్లతో జిల్లాకు కొత్త కంపెనీలు వచ్చాయన్నారు. నిరుద్యోగుల్ హైదరాబాద్ కు వెళ్లకుండా నిజామాబాద్ లో పలు ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు కల్పించామన్నారు. తెలంగాణ పథకాలు దేశంలోనే నంబర్ వన్ గా ఉన్నాయని తెలిపారు.

నిజామాబాద్ 2014లో చరిత్ర సృష్టించిందని..ఈ సారి ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించాలన్నారు. నిజామాబాద్ అంటేనే తెలంగాణకు కంచుకోట అన్నారు. రూ.530 కోట్లతో పించన్లు ఇస్తున్నామని..లక్షా 5వేల కేసీఆర్ కిట్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. జిల్లాలో 1625 గ్రామాలకు నీటిని అందిస్తున్నాం. ఇంటింటికీ నీళ్లు ఇచ్చేందుకు రూ. 4 వేల కోట్లతో ప్రణాళికలు తయారు చేసుకున్నాం.  నిజామాబాద్‌ లోనే సాఫ్ట్‌ వేర్ జాబ్స్ వచ్చే విధంగా ఐటీ హబ్‌ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. 4 లక్షల78 వేల మంది రైతన్నలకు రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ. 4 వేలు ఇచ్చామన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటేయ్యాలి. 2014 ఫలితాలను మళ్లీ నిజామాబాద్ జిల్లాలో పునరావృతం చేయాలని పిలుపునిచ్చారు ఎంపీ కవిత.

 

 

 

Posted in Uncategorized

Latest Updates