నిజామాబాద్ లో కేంద్రీయ విద్యాలయం

NZ KVనిజామాబాద్ విద్యార్థులకు గుడ్ అందించింది కేంద్ర ప్రభుత్వం. నిజామాబాద్ కు కేంద్రీయ విద్యాలయం మంజూరు అయింది. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల కిందటే బోధన్ కు కేంద్రీయ విద్యాలయం మంజూరు కాగా.. ఇప్పుడు నిజామాబాద్ కు మంజూరు అయింది. నాలుగేళ్లలో ఒకే జిల్లాకు రెండు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కావడం విశేషం.

ఎంపీ కల్వకుంట్ల కవిత అప్పటి HRD మంత్రి స్మృతి ఇరానీ, ప్రస్తుత మంత్రి ప్రకాశ్ జవదేకర్ లకు కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు అవశ్యకతను తెలియజేస్తూ లేఖలు రాశారు. వ్యక్తిగతం గాను కలిసి కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లాను విద్యారంగంలో ముందంజలో ఉంచేందుకు ఎంపీ కవిత చేస్తున్న కృషి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. గతంలోనూ కేంద్రీయ విద్యాలయం కోసం కవిత కేంద్రాన్ని కోరడంతో ఆమె కృషి ఫలించినట్లైంది.

 

Posted in Uncategorized

Latest Updates