నిజామాబాద్ సభ ఎఫెక్ట్.. బస్టాండ్లు కిటకిట

జగిత్యాల : నిజామాబాద్ లో టీఆర్ఎస్ ఎన్నికల బహిరంగ సభ ప్రభావం ఆర్టీసీ ప్రయాణంపై కనిపిస్తోంది. నిజామాబాద్-మెట్ పల్లి-కోరుట్ల- జగిత్యాల రూట్ లో ఇవాళ బస్సులు బాగా తగ్గిపోయాయి. నిజామాబాద్ లో సభకు గులాబీ బాస్ కేసీఆర్ వస్తుండటంతో… జనాన్ని బస్సుల్లో తరలిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ బస్సులు, డీసీఎంలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో కార్యకర్తలను వేలాదిగా తరలించారు. దీంతో.. బస్సుల సంఖ్య సగానికి తగ్గిపోయింది. బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

నిజామాబాద్ సభకు కనీసం 30వేల మందిని తీసుకురావాలనేది టీఆర్ఎస్ నాయకుల టార్గెట్. అందుకు తగ్గట్టే.. ఉమ్మడి జిల్లా పరిధిలోని గ్రామాలనుంచి జనాన్ని సభకు సమీకరించారు నాయకులు. ప్రతి డిపో నుంచి కనీసం సగం బస్సులను కిరాయి చెల్లించి సభకు తరలించినట్టు తెలిసింది. సభతో ఆర్టీసీ డిపోలకు ఆర్థికంగా కలిసివచ్చింది. ఐతే… తక్కువ బస్సులే అందుబాటులో ఉండటంతో…. ప్రతి బస్సూ కిక్కిరిసి కనిపిస్తోంది. ఎక్కువ రేట్ అయినప్పటికీ.. జనం ప్రైవేటు వాహనాల్లోనే గమ్యస్థానాలను వెళ్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates