నిజాయితీకి నిలువెత్తు ఆదర్శం : అవినీతిని పట్టించినోళ్లను ఇలా ఊరేగించారు

పట్టణ వీధుల్లో కోలాహలం.. ఓ ముగ్గురి అశ్వరథంపై ఊరేగిస్తున్నారు.. మెడలో దండలు, నెత్తిపై టోపీలు పెట్టి ఉన్నాయి.. చేతుల్లో పుష్పగుచ్చాలు.. పెద్ద వేడుకగా సాగుతుంది ఊరేగింపు.. వీధుల్లో వెళుతున్న రథం చూసి ఒక్కొక్కరూ రావటం మొదలుపెట్టారు.. ఏంటా అని ఆరా తీశారు అప్పుడు అసలు విషయం అర్థమైంది. అది పెళ్లి సందడి కాదు.. నిజాయితీకి నిలువెత్తు ఆదర్శంగా గుర్తించి మరీ ఆ ముగ్గురికీ జరుగుతున్న సన్మానం అని తెలిసి ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే..

మహబూబాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ యాదవ్‌, నర్సంపేటకు చెందిన జడల వెంకటేశ్వర్లు, భూపాల్‌పల్లి జిల్లా జంగేడుకు చెందిన పాలిక రఘుచారి ఈ ముగ్గురి వివిధ పనుల కోసం ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగారు. విషయాన్ని ACB అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీరి ద్వారా.. ఏసీబీ లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అవినీతి అధికారులను పట్టించిన నిజాయితీపరులుగా వీరిని ఈ విధంగా ఘనంగా సత్కరించింది జ్వాల స్వచ్చంధ సంస్థ. ఈ ముగ్గురినీ జూలై 20వ తేదీ శుక్రవారం మహబూబాబాద్ పట్టణంలో గుర్రపు బండీ ఎక్కించి ఊరేగించారు. సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ వ్యవస్థాపకుడు సుంకరి ప్రశాంత్ నిర్వహించారు. జయప్రకాశ్ నారాయణ కూడా హాజరై.. ఒక్కొక్కరికీ రూ.15వేలు నగదు బహుమతి అందజేశారు.

Posted in Uncategorized

Latest Updates