నితీశ్ యూటర్న్ : బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్

PTI12_4_2017_000027Bమరోసారి బీహార్ సీఎం నితీశ్, ప్రధాని మోడీ ల మధ్య మరోసారి అగాధం ఏర్పడినట్లు తెలుస్తోంది. నోట్ల రద్దును కొంతకాలం క్రితం వరకూ బహిరంగంగా సమర్ధించిన నితీశ్ మూడురోజుల క్రితం యూటర్న్ తీసుకొన్నారు. అంతేకాకుండా ఇప్పుడు రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం 2000ను ప్రస్తావిస్తూ… బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విద్య, ఆరోగ్యం, తలసరి ఆదాయం, వంటి వివిధ అంశాల్లో జాతీయ సగటుకంటే రాష్ట్ర సగటు చాలా తక్కువగా ఉందన్నారు. అందుకోసం తాము ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నామని నితీశ్ తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ బీజేపీ తో తెగదెంపులు చేసుకుంది టీడీపీ. టీడీపీ తమను వదిలిపెట్టినంత మాత్రాన తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని, తమకు నితీశ్ ఉన్నారని బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా ఇటీవల అన్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు నితీశ్ కూడా ప్రత్యేక హోదా డిమాండ్ తెరపైకి తీసుకురావడంతో అందరిలో ఆశక్తి నెలకొంది.

 

Posted in Uncategorized

Latest Updates