నిద్రలోనే తుదిశ్వాస విడిచిన మాట్లాడే గొరిల్లా

gorillaపువ్వు పుట్టగానే పరిమలించునన్నట్లు…కొందరు పుట్టగానే మహాత్తరమైన శక్తి, యుక్తులతో అలరారుతుంటారు… అలాగే ఓ గొరిల్లా కూడా కొన్ని సూపర్ పవర్స్‌తో పుట్టింది. సాధారణంగా జంతువులకు ఉండని శక్తి ఈ గొరిల్లాకు ఉండడంతో చరిత్రకెక్కింది. తన టాలెంట్‌తో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దాని టాలెంట్‌కు మెచ్చిన నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్ నిర్వాహకులు దాన్ని తమ మ్యాగజైన్ ముఖచిత్రంగా ప్రచురించారు. తన అద్భుతమైన పవర్స్‌తో సైంటిస్టులనే ఆశ్చర్యానికి గురి చేసింది ఈ గొరిల్లా. మొత్తం వెయ్యి రకాల హావభావాలను పలికించగల దిట్ట ఈ గొరిల్లా. 46 ఏళ్ల కోకో… గత మంగళవారం కాలిఫోర్నియాలో నిద్రలోనే తుదిశ్వాస విడిచింది.

శాన్ ఫ్రాన్సిస్కోలోని జూలో జులై 4, 1971లో జన్మించింది ఈ గొరిల్లా. పుట్టినప్పుడు దానికి హనాబికొ అనే జపనీస్ పేరును పెట్టారు. తర్వాత కోకోగా మార్చారు. అది పుట్టినప్పటి నుంచి తన టాలెంట్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలిచేది. అమెరికన్ సైన్ భాషలో మనుషులతో మాట్లాడటం ప్రారంభించింది కోకో. నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్ కవర్ కోసం ఫోటోను కోకోనే తీసుకున్నట్లు గొరిల్లా ఫౌండేషన్ తెలిపింది. అంతే కాదు.. పెట్స్‌ను దత్తత తీసుకోవడం, వాటికి పేరు పెట్టడం లాంటి పనులు కూడా అది చేసేది ఆ గొరిల్లా. 1985లో అల్‌బాల్ అనే పిల్లి కూనను కోకో దత్తత తీసుకుంది. దాన్ని ఆధారంగా చేసుకొని గొరిల్లా జాతిపై, వాటి మేథో సంపత్తిపై సైంటిస్టులు ఎన్నో పరిశోధనలు చేశారు. కోకో తన జీవితాన్నంతా కాలిఫోర్నియాలోని గొరిల్లా ఫౌండేషన్‌లోనే గడిపింది. 2001లో దివంగత నటుడు రాబిన్ విలియమ్స్‌తో ఓ సినిమాలోనూ నటించింది కోకో.

Posted in Uncategorized

Latest Updates