నిధులు ఎలా ఖర్చు చేశారో చెప్పండి: సోము వీర్రాజు

somuఆంధ్రప్రదేశ్ కు నిధులివ్వడం లేదంటున్న టీడీపీ.. కేంద్రం ఇచ్చిన 2500 కోట్లు దేనికి ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు బీజేపి ఎమ్మెల్సీ సోమువీర్రాజు. విశాఖపట్నం రైల్వే జోన్,.. దుగ్గరాజపట్నం పోర్టు విభజన బిల్లులో పరిశీలించాలని మాత్రమే ఉందని… ప్రత్యేక హోదాను కూడా బిల్లులో పెట్టలేదన్నారు. 2017 బడ్జెట్‌ తర్వాత సీఎం  చంద్రబాబు, రాష్ట్ర మంత్రులతో పాటు కేంద్రమంత్రి సుజనాచౌదరి కూడా కేంద్రాన్ని మెచ్చుకున్నారని.. ఏ రాష్ట్రానికి ఇవ్వనంతగా నిధులు ఇచ్చారని కొనియాడారన్నారు.ఇప్పడు అసలు నిధులే ఇవ్వలేదన్నట్లుగా.. చంద్రబాబు ఎందుకు మాట మార్చారో తెలియడం లేదన్నారు సోము వీర్రాజు.

Posted in Uncategorized

Latest Updates