నినాదం కాదు.. పనిష్మెంట్ : బండితో నడిచి వెళ్లండి

traficహెల్మెట్ లేదంటే చలానా విధిస్తారు.. పదే పదే దొరికితే జైలుకి కూడా పంపిస్తారు.. పిల్లలు బండితో కనిపిస్తే పేరంట్స్ కి శిక్ష విధిస్తారు.. ఇన్ని కఠిన నిబంధనలు విధిస్తున్నా ఇప్పటికీ వాహనదారుల్లో మార్పు రావటం లేదు. హెల్మెట్ అనేది ప్రాణాలను కాపాడేది అని చెబుతున్నా కుర్రకారు చెవులకు మాత్రం ఎక్కటం లేదు. ఎప్పుడో కట్టే చలానా కంటే.. స్పాట్ లో పనిష్మెంట్ విధిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది ఆగ్రా పోలీసులు. అంతే అమలు చేశారు. జస్ట్ వారం రోజుల్లోనే ఆగ్రా సిటీలో అద్భుతమైన మార్పు వచ్చింది.. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా సిటీలో హెల్మెట్ పెట్టుకోవటం విధిగా అమలు చేస్తున్నారు. అలా కాకుండా ఎవరైనా వాహనదారుడు కనిపిస్తే చాలు వెంటనే ఆపుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. బండి దింపుతారు. తాళం లాక్కుంటారు. బండితో నడిచి వెళు అంటున్నారు. అలా అర కిలోమీటర్ దూరం బండిని చచ్చీచెడీ లాక్కెళ్లిన తర్వాత.. అప్పుడు బైక్ తాళం ఇస్తున్నారు. అప్పటికే వాహనదారుడి ఒంట్లోని సత్తా అయిపోతుంది. నీరస పడతాడు. పెట్రోల్ అయిపోతేనే నాలుగు అడుగులు వేయనోళ్లు.. అర కిలోమీటర్లు బండిని లాక్కుని వెళ్లటం అంటే మాటలా. దీంతోపాటు ఫైన్ కూడా కట్టాల్సింది.

వారం రోజులుగా అమలు చేస్తున్న ఈ విధానంతో ఆగ్రా సిటీలో అద్భుతమైన ఫలితం కనిపించిందంట. హెల్మెట్ లేకుండా దొరికితే బండి లాక్కెళ్లటం మహా కష్టం అని భావించిన వాహనదారులు హెల్మెట్ లేకుండా బయటకు రావటానికి భయపడుతున్నారు. లేనివాళ్లు కొత్తది కొనుగోలు చేయటానికి షాపులకి క్యూ కడుతున్నారు. ఐడియా అదిరింది కదా..

Posted in Uncategorized

Latest Updates